Samantha: హీరోయిన్ శోభితాతో డేటింగ్.. ట్విట్టర్లో చైతూ ఫాన్స్ కు సామ్ స్ట్రాంగ్ కౌంటర్
Naga Chaitanya Fans Were Warned By Samantha| టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్య ఇటీవల డీవోర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి వర్క్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే విడాకుల తర్వాత చైతు మళ్లీ ప్రేమలో పడి
దిశ, వెబ్‌డెస్క్: Naga Chaitanya Fans Were Warned By Samantha| టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్య ఇటీవల డీవోర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి వర్క్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే విడాకుల తర్వాత చైతు మళ్లీ ప్రేమలో పడి, హీరోయిన్ శోభితా ధూళిపాలితో డేటింగ్ లో ఉనట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి.'నాగచైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే సమంత ఇలా చేయిస్తోందనే పూకార్లు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సామ్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమే కానీ, అబ్బాయిలపై వస్తే మాత్రం అమ్మాయిలే చేయించారని ప్రచారం చేస్తారా..? ఇకనైనా ఎదగండి అబ్బాయిలు.. మీరు ప్రస్తావించిన వ్యక్తులు ముందుకెళ్లిపోతున్నారు.. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పని మీద, మీ కుటుంబ విషయాల మీద ఏకాగ్రత పెట్టండి''అని సమంత ట్వీట్ చేసింది. అది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్లు, మీమ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
Rumours on girl - Must be true !!
— Samantha (@Samanthaprabhu2) June 21, 2022
Rumours on boy - Planted by girl !!
Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6