Skin health : ఫేషియల్ లేకుండానే ఫేస్ గ్లోయింగ్

Skin health : ఫేషియల్ లేకుండానే ఫేస్ గ్లోయింగ్

Update: 2024-11-28 14:27 GMT

దిశ, ఫీచర్స్ : అందంగా కనిపించాలన్న ఆరాటం అందరిలో ఉటుంది. అయితే కొన్నిసార్లు చర్మంపై మృత కణాలు పెరిగి, పగుళ్లు ఏర్పడి డ్రైగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో ముఖ వర్ఛస్సు తగ్గుతుంది. దీంతో రకరకాల క్రీములు వాడుతుంటారు, ముఖ్యంగా అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే అలాంటి అవసరం లేకుండా ఇంటి చిట్కాలతోనే ఫేస్ గ్లోయింగ్ పెంచుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో చూద్దాం.

* తేనె, నిమ్మరసం : నిమ్మకాయలో విటమిన్ సి, తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఓ గిన్నెలో తేనె, పాలు, నిమ్మరసం సమపాలలో మిక్స్ చేయండి. తర్వాత ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగండి. అప్పుడు మీ ముఖ చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

* బియ్యపు పిండి : చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బియ్యపు పిండి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా పిండి తీసుకొ

ని, కొంచెం ఆముదం, కొన్ని పాలు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేస్తే చాలు. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున పసుపు, పెరుగు కూడా స్కిన్ గ్లోయింగ్ కోసం ఉపయోగపడతాయి. రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ పసుపు కలిపి పేస్ట్‌లా మారాక ముఖానికి అప్లై చేసి, 15 నిబిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి. దీంతో ఫేషియల్ అవసరం లేకుండానే మీ ఫేస్ నిగ నిగలాడుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Read More...

Beer Benefits : రోజూ బీరు తాగుతున్నారా..? తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..


Tags:    

Similar News