Ananya Nagalla: ‘పొట్టేల్’ నైజాం రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ.. హైప్ పెంచేస్తున్న పోస్టర్

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ‘వకీల్ సాబ్’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-10-10 11:11 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) ‘వకీల్ సాబ్’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ‘పొట్టేల్’ (Pottel) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. సాహిత్ మోత్కురి దర్శకత్వంలో వస్తు్న్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.

ఎన్‌ఐఓస్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి (Nishank Reddy), ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ (Suresh Kumar) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘పొట్టేల్’ నైజాం రైట్స్‌ను మైత్రీ మూవీ డిస్టిబ్యూటర్స్ (Distributors) సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గాా అనౌన్స్ చేసిన పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Similar News