మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసిన బోల్డ్ బ్యూటీ.. షాక్లో ఫ్యాన్స్
దిశ, సినిమా : హిందీ టెలివిజన్లో బోల్డ్ బ్యూటీగా ప్రసిద్ధి చెందిన అషిమ్మత్తన్.. తన మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసింది.
దిశ, సినిమా : హిందీ టెలివిజన్లో బోల్డ్ బ్యూటీగా ప్రసిద్ధి చెందిన అషిమ్మత్తన్.. తన మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసింది. ప్రియుడు మృణాల్ దేశ్రాజ్ను జూలై 10న సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. నిజానికి జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కుతుందని ఎవరూ ఊహించలేదు. కాగా తామిద్దరం ఒకరినొకరు తోడు లేకుండా జీవించడం కష్టంగా అనిపించిందని, అందుకే పవిత్రమైన వివాహంతో ఏకం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీస్సులు కావాలన్న నటి.. దేశ్రాజ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. అలాగే తనకు కాబోయే భర్త ఎల్లప్పుడూ మాటకు కట్టుబడి ఉండటం గొప్పగా అనిపిస్తుందని, అతనిలాంటి వ్యక్తి ఎవరి జీవితంలోకి వచ్చిన స్వర్గమే అంటూ పొగిడేసింది. నిజానికి జూలై 5న కోర్టు ద్వారా చట్టబద్ధంగా మ్యారేజ్ జరిగిందన్న అషిమ్.. కుటుంబ సభ్యులు, అభిమానుల కోసం మరోసారి ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.