పీహెచ్‌సీలో ఖాళీల‌ భ‌ర్తీపై కేంద్రాన్ని నిల‌దీసిన టీఆర్ఎస్ ఎంపీ

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ‌వ్యాప్తంగా ప్రాథ‌మిక - MP Nama Nageswara Rao deposes Center in Lok Sabha over filling of vacancies in PHC

Update: 2022-04-01 12:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ‌వ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేశారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్రపంచాన్ని క‌బ‌ళించిన వేళ వైద్యం రంగంపై కేంద్రం మ‌రింత దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అంద‌క పేద ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

పీహెచ్ సీలో ఖాళీలు భ‌ర్తీ చేస్తే అట్టడుగున ఉన్న ప్రజానీకానికి వైద్యం అందుతుంద‌ని చెప్పారు. అయితే, వైద్య రంగం రాష్ట్రాల ప‌రిధిలోని విష‌య‌మ‌ని.. తాము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేవ‌లం సాంకేతిక‌, ఆర్థిక సాయం మాత్రమే చేస్తామ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి భార‌తి ప్రవిణ్ ప‌వార్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. అయితే, వైద్య శాఖ‌కు మ‌రింత ప్రాధాన్యత అవ‌స‌ర‌మ‌ని ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ సంద‌ర్భంగా ఉద్ఘాటించారు.

Tags:    

Similar News