వైద్య పరికరాల దిగుమతుల తగ్గింపునకు ఏం చేశారు? ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: వైద్య పరికరాల - MP Adala Prabhakar Reddy questioned the central government in Parliament on measures to reduce imports of medical devices
దిశ, ఏపీ బ్యూరో: వైద్య పరికరాల దిగుమతుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్‌లో శుక్రవారం ప్రశ్నించారు. వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తికి ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ) అమలు పరిస్థితిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఎంపీ ఆదాల అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి భగవంత్ ఖుబా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు.
21 మంది దరఖాస్తుదారులు రూ.3,420 కోట్ల అంచనాతో దరఖాస్తు చేశారని వెల్లడించారు. ఇందులో రూ.1058.97 కోట్ల కూడిన పెట్టుబడిదారులను ఆమోదించి ఆహ్వానించినట్లు తెలిపారు. వైద్య పరికరాల పార్కుల ఏర్పాటు కోసం మరో పథకాన్ని ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఈ పార్క్ లో సాధారణ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.400 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి భగవంత్ ఖుబా పేర్కొన్నారు.