కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ.. దానిపై ఏం చర్యలు తీసుకున్నారని?
దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే ఆక్వా- MP Adala Prabhakar Reddy questioned in the Lok Sabha on aqua issues in Nellore district
దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే ఆక్వా మత్స్య పరిశ్రమకు పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, గిట్టుబాటు ధర లభించక ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో మంగళవవారం ప్రశ్నించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహకాలను అందిస్తోందని కూడా అడిగారు. దీనికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా ఆక్వా, చేపల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన విషయం నిజమేనని అంగీకరించారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా, మత్స్య పరిశ్రమకు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి రాలేదని తెలిపారు. కేంద్రం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని అమలు చేస్తోందని, ఇందుకుగానూ 20,050 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2020- 21,22 ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆక్వా, మత్స్య అభివృద్ధికి 657.11 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించినట్లు తెలిపారు. ఇందులో నెల్లూరు జిల్లాకు 149. 23 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పేర్కొన్నారు.