విలన్స్‌గా మారుతున్న సినిమా హీరోలు: హైకోర్టు న్యాయమూర్తి

దిశ, అంబర్ పేట్: ఒక్కప్పుడు సినిమా కథానాయకుడు పాత్ర ఎంతో సంస్కార, సాంప్రదాయ బద్దంగా ఉండేదని, latest telugu news..

Update: 2022-03-16 16:46 GMT

దిశ, అంబర్ పేట్: ఒక్కప్పుడు సినిమా కథానాయకుడు పాత్ర ఎంతో సంస్కార, సాంప్రదాయ బద్దంగా ఉండేదని, నేటి హీరో పాత్రలు స్మగ్లర్, రౌడీ, గూండాలుగా అర్థం మారిపోయిందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి అన్నారు. యువకళావహిని సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు సంస్మరణ సభ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జస్టిస్ రాధారాణి పాల్గొని ప్రముఖ నట, దర్శకుడు గిరిబాబుకు 'అక్కినేని అభినయ పురస్కారం' ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ కి 'దర్శక ప్రతిభా పురస్కారం' ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటి నటులు తమ ఉన్నత పాత్రలలో నటించి సమాజంలో ఉన్నతంగా స్థాయిలో నిలిచారని పేర్కొన్నారు. నేటి దర్శక నిర్మాతలు హీరోలను విలన్స్‌గా చిత్రీకరించి సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షత వహించిన అక్కినేని నాటక కళా పరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ.. అక్కినేని ఉన్నత నటులని ఆయన పేరిట ప్రతి సంవత్సరం నాటక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రవాణా శాఖ విశ్రాంత కమిషనర్ గాంధీ మాట్లాడుతూ.. అక్కినేని జీవితాంతం నాస్తికుడు గా ప్రకటించుకున్న ఏకైక నటులని వివరించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి పురస్కార గ్రహీతలను అభినందించారు. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ స్వాగతం పలికిన సభలో సినీ జర్నలిస్ట్ ఎస్ వి రామారావు వ్యాఖ్యానం చేశారు. సభకు ముందు గాయనీ, గాయకులు వినోద్ బాబు, బాల కామేశ్వరరావు, సురేఖ, శారద ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

Tags:    

Similar News