MS Dhoni : కెరీర్ ఫినిష్ అంటూ ట్రోల్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన మహ్మద్ కైఫ్
దిశ, వెబ్‌డెస్క్: గత సీజన్ విజేత చెన్నై - Mohammad Kaif responds to trolls on social media over Dhoni's career end
దిశ, వెబ్‌డెస్క్: గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్-2022 టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో KKR.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ రోజు మరో పోరాటానికి సిద్ధపడుతుంది. ముంబై బ్రబౌర్స్ స్టేడియంలో పంజాప్ కింగ్స్‌లో తలపడనుంది.
జాతీయ జట్టులోనూ, ఐపీఎల్‌లో ఇతర ప్రాంఛైజీల్లోనూ సారథ్య బాధ్యతలను తీసుకున్న అనుభవం లేని రవీంద్ర జడేజా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే జడేజ కెప్టన్‌గా రాణించడం లేదు.. ఇక బౌలర్, బ్యాటర్‌గానూ విఫలమౌతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో జట్టుపై విమర్శలను ఎదుర్కొంటొంది. సోషల్ మీడియాలో ధోనీని సైతం వదలట్లేదు ట్రోలర్స్. కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్న తరువాత ధోనీ పని అయిపోయిందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకొంటాడని.. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ధోనిపై ఈ విమర్శలపై మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు. ధోనీ కథ ముగిసిందంటూన్న వారి నోళ్లు త్వరలోనే మూతపడతాయనీ స్పష్టం చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో ''ధోని ఫినిష్ నహీ, ఫినిషర్ హై.. పిక్చర్ అభీ బహుత్ బాకీ హై'' అంటూ.. ట్రోలర్స్‌కు తనదైనా శైలిలో సమాధానం ఇచ్చాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో ధోనీ నాటౌట్‌గా నిలిచిన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో సత్తా చాటాడని, రెండో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 16 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. ధోనీ ఫినిషర్ తప్ప.. అతని కేరీర్ ఫినిష్ కాదని అన్నాడు.
Dhoni finish nahi, finisher hai. Not out again, picture aabhi bahut baaki hai. @msdhoni
— Mohammad Kaif (@MohammadKaif) March 31, 2022