బొల్లోజు అయోధ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

దిశ,మణుగూరు: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య కుటుంబాన్ని ప్రభుత్వ విప్.. Latest Telugu News..

Update: 2022-03-06 06:09 GMT

దిశ,మణుగూరు: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య కుటుంబాన్ని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పరామర్శించారు. ఆదివారం జడ్పిటిసీ పోశం నరసింహారావు నేతృత్వంలో బొల్లోజు అయోధ్య కుటుంబాన్ని సందర్శించి అయోధ్య సతీమణి ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవులు, రాజకీయాలు ముఖ్యం కాదు.. మంచితనం, మానవత్వమే ముఖ్యమన్నారు. సీపీఐ రాష్ట్ర సభ్యులు బొల్లోజు అయోధ్య సతీమణి కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకుని అయోధ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు. కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

అనంతరం మండలంలోని కొండాయిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతారాములు ప్రమాదవశాత్తు చెయ్యి విరగడంతో విషయం తెలుసుకుని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నానన్నారు. ఈకార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, బొలిశెట్టి నవీన్, ఆవుల నరసింహారావు, తాత రమణ, ఉప సర్పంచ్ ప్రభుదాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News