అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లా - MLA Patnam Narender Reddy directed the authorities to expedite the development work

Update: 2022-03-13 11:35 GMT
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
  • whatsapp icon

దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. అనంతరం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన (ఆరు) దుకాణాలకు (42లక్షలు)తో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని సిసి రోడ్లు డ్రైన్లు కరెంట్ పోల్స్ వీధిలైట్లను పరిశీలించారు. అధికారులతో తదితర సమస్యలపై చర్చించారు మున్సిపల్ లోని ఇంకా జరగవలసిన పనులను అధికారులతో నాయకులతో మాట్లాడి తొందరలో పూర్తి చేయాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి వైస్ చైర్ పర్సన్ ఉష రాజేందర్ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి టి. టి రాములు, కమిటీ వైస్ చైర్మన్ నరోత్తం రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News