Jagga Reddy: సంగారెడ్డి భారీ బహిరంగ సభ.. ఆరోజే జగ్గారెడ్డి సంచలన ప్రకటన

MLA Jagga Reddy To hold Public Meeting in Sangareddy| తెలంగాణల కాంగ్రెస్‌లో నిత్యం ఓ పంచాయతీ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన

Update: 2022-07-08 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: MLA Jagga Reddy To hold Public Meeting in Sangareddy| తెలంగాణల కాంగ్రెస్‌లో నిత్యం ఓ పంచాయతీ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో రచ్చ ఏర్పడింది. ఆ సందర్భంలో తాను సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరుసటి రోజే తాను చెప్పబోయే సంచలన ప్రకటన వాయిదా వేస్తున్నానని.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అయితే, శుక్రవారం సంగారెడ్డిలో మీడియాలో మాట్లాడిన జగ్గారెడ్డి దసరా రోజున సంగారెడ్డి సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. తాను పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ వీడుతున్నానంటూ జరుగతున్న ప్రచారం అంతా వట్టిదేనని ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని.. ఆ పని జరగదని తేల్చేశారు. తాను టీఆర్ఎస్‌లో చేరుతానని జరుగుతున్న ప్రచారం ఎన్నటికీ నిజం కాబోదని అన్నారు. అలాగే ఇకపై తన ఫోకస్ అంతా సంగారెడ్డి నియోజకవర్గంపైనే ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే నాలుగు నెలల పాటు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్లు నిర్వహించబోనని వెల్లడించారు.

యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ నేతలలెవరూ ఆయన్ను కలవడానికి వీళ్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుకుం జారీ చేశారు. దీనిపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొంతం కాదని అన్నారు. తాను యశ్వంత్ సిన్హాను కలుస్తానని బహిరంగ కామెంట్స్ చేశారు. అదే సందర్భంలో తాను రేపు సంచలన ప్రకటన చేయబోతున్నానని మీడియాకు వివరించారు. దాంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటానే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కానీ, అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ తన నిర్ణయం మార్చుకున్నారు. తాను చేస్తానన్న సంచలన ప్రకటనకు ఇంకా సమయం ఉందని దాటవేశారు.

అలాగే తన మాటలను కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని, తాను ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోరే వ్యాఖ్యలు చేస్తానని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయని తన మాటలను కూడా వ్యూహంలో భాగంగానే అర్థం చేసుకోవాలని కోరారు. అయితే, ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న క్రమంలో శుక్రవారం ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. స్టేట్ లీడర్‌గా పలుకుబడి ఉన్న జగ్గారెడ్డి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించబోనని ఎందుకు ప్రకటించారు? నియోజక వర్గంపైనే దృష్టి సారిస్తాన్న కామెంట్లు ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకీ దసరా నాడు ఆయన ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News