ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు సంబురాలు..

దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో- latest Telugu news

Update: 2022-03-13 15:33 GMT

దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సంబరాలలో ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొ్న్నారు. అనంతరం స్థానిక ఎంపీపీ రమేష్ నాయక్, జెడ్పీటీసీ సుమన రవిరెడ్డిలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. కవిత బతుకమ్మకు ప్రపంచ దేశాలలో గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. బీడి కార్మికులు అయిన మహిళలకు పెన్షన్ ఇచ్చే విధంగా కృషి చేసిన ఘనత ఆమె దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ ఛైర్మన్ సంబరి మోహన్, స్థానిక జెడ్పీటీసీ సుమన రవిరెడ్డి, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు గంగాదాస్, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శెట్టి బిరిష్, పీఎసీఎస్ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, సుధాకర్, దాస్, సీనియర్ నాయకులు రఘు, ఖుర్షిద్, హుస్సేన్, నామాల గంగాధర్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News