మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి..

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో దారుణ ఘటన సంభవించింది. ముగ్గురు విద్యార్థులు(మైనర్) కలిసి తన క్లాస్‌మేట్ అమ్మాయి (మైనర్)పై లైంగికదాడికి పాల్పడ్డారు..Latest Telugu News

Update: 2022-07-08 09:22 GMT

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో దారుణ ఘటన సంభవించింది. ముగ్గురు విద్యార్థులు(మైనర్) కలిసి తన క్లాస్‌మేట్ అమ్మాయి (మైనర్)పై లైంగికదాడికి పాల్పడ్డారు. స్కూల్‌కి వెళ్లనని బాలిక చెప్పడంతో తన తల్లికి అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్స్ యాక్ట్ (ఫోక్సో) ప్రకారం ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలో 15 ఏళ్ల బాలిక చదువుతోంది. బర్త్‌డే పార్టీ పేరుతో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బాలికను 10వ తరగతి క్లాస్‌రూమ్‌కి తీసుకొచ్చాడు. బాలిక క్లాస్‌రూమ్‌లోకి రాగానే.. మరో ఇద్దరు స్నేహితులు రూమ్‌లోకి ప్రవేశించిన తలుపులు మూసివేశారు. లైంగిక వేధింపులకు పాల్పడి.. వీడియో కూడా రికార్డ్ చేసి.. తన తోటి స్నేహితులకు వీడియో షేర్ చేశారు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి.. ఆ ముగ్గురు విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఇంటికి వచ్చిన బాలిక స్కూల్‌కు వెళ్లనని చెప్పడంతో తన తల్లికి అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీస్‌స్టేషన్‌ వెళ్లి కేసు నమోదు చేయగా.. పోలీసులు ఆ ముగ్గురు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్నారు.


Similar News