బీజేపీ ప్రచారాన్ని ఎండగట్టాలి.. ఆ బాధ్యత మీదే అన్న మంత్రి
దిశ, సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండల తెలంగాణ రాష్ట్ర సమితి యువజన.. Latest Telugu News..
దిశ, సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండల తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం నూతన కార్యవర్గాన్ని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నంగునూర్ మండల యువజన విభాగం అధ్యక్షుడిగా సందబోయిన శ్రీకాంత్ యాదవ్, సమన్వయకర్తగా విక్రమ్లని నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని, ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గొప్పది అని, అదే పంథాలో పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని, ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీపై ఉందని సూచించారు. పార్టీకి విద్యార్థి, యువతే పట్టుకొమ్మలని చెప్పారు.
బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాలని ఎండగట్టాలని, బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అని ఎద్దవా చేశారు. ఉన్న ఉద్యోగాలను ఉడగొట్టిన ఘనత బీజేపీ పార్టీదన్నారు. మన ప్రభుత్వం వచ్చాక వివిధ శాఖల ద్వారా గతంలో లక్ష పైన ఉద్యోగాలు వేశామని, మొన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మరో 91 వేల ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్లు వేయనునట్లు చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్రంలో ఉండే నీతి ఆయోగ్ అభినందించిందని చెప్పారు.పార్టి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లెడం మీ క్రియాశీలక పాత్ర పోషించాలనని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.