70 ఏళ్లలో 4 మెడికల్ కాలేజీలు.. 7 ఏళ్లలో జిల్లాకో మెడికల్ కాలేజీ: మంత్రి
దిశ, సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండల తెలంగాణ రాష్ట్ర సమితి యువజన.. Latest Telugu News..
దిశ, సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండల తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం నూతన కార్యవర్గాన్ని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేట రూరల్ మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా మారెడ్డి శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని , ఉద్యమంలో యువకులు , విద్యార్థుల పాత్ర గొప్పదని, అదే పంథాలో పార్టీ క్రియాశీలకంగా ఉండాలని, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీ పై ఉందని సూచించారు. ఆరోగ్య తెలంగాణలో బాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వైద్య విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం జిల్లాకో మెడికల్ కాలేజ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. జాతీయ పార్టీలు పరిపాలించిన సమైక్య రాష్ట్రంలో 70 ఏళ్లలో 4 మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 7 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, ఇది సీఎం కేసీఆర్ ఘనతకు నిదర్శనమని అన్నారు.
ఒక వైపు వైద్య విద్య.. మరోవైపు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. సీఎం కేసీఆర్ వైద్య విద్యను ప్రోత్సాహించే ఆలోచన చేశారన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కొసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే.. బీజేపీ మాత్రం దేశంలోని అన్ని వర్గాల ప్రజలను సంక్షోభంలో పడేసిందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారుదులు.. పార్టీ భవిష్యత్ సారథులు మీరే అని విద్యార్థులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ప్రజల్లోకి తీసుకెళ్లండని చెప్పారు .బీజేపీ చేస్తున్న అసత్యపు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని , బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అని ఎద్దవా చేశారు.
ఉన్న ఉద్యోగాలను ఉడగొట్టిన ఘనత బీజేపీ పార్టీదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక విద్యా , వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని , ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్రంలో ఉండే నీతి ఆయోగ్ అభినందించిందని చెప్పారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ క్రియాశీలక పాత్ర పోషించాలనని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.