Errabelli Dayakar Rao: నేను వచ్చింది యాదాద్రికేనా...? అనేలా అభివృద్ధి చెందింది: మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli Dayakar Rao Visits Yadadri Temple| యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డిలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
దిశ, యాదగిరిగుట్ట: Minister Errabelli Dayakar Rao Visits Yadadri Temple| యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డిలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు మా ఇలవేల్పు అని అన్నారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. గతంలో యాదాద్రికి వచ్చినవారు ఇప్పుడు వచ్చి చూస్తే యాదాద్రి కేనా వచ్చింది అని ఆశ్చర్యపోయేలా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రపంచం అబ్బురపడేలా ప్రఖ్యాత దేవాలయంగా యాదాద్రిని సీఎం తీర్చిదిద్దారన్నారు. మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. దర్శనం అనంతరం అర్చకులు మంత్రికి ప్రసాదం అందజేశారు.