Indigo: స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను నియమించుకున్న ఇండిగో
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లుగా ఏవియేషన్..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లుగా ఏవియేషన్ లిమిటెడ్ విక్రమ్ సింగ్ మెహతా, రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బి ఎస్ ధనోవాలను నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వారి నియామకాలు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (MoCA) నుండి సెక్యూరిటీ క్లియరెన్స్, కంపెనీ సభ్యుల ఆమోదానికి లోబడి ఉంటాయి. అనుపమ్ ఖన్నా రెండవ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో మెహతా నియమితులయ్యారు. మెహతా లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, కోల్‌గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్, అపోలో టైర్స్ లిమిటెడ్, హెచ్‌టి మీడియా లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్‌తో సహా అనేక కంపెనీల బోర్డులలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నారు. స్వతంత్ర డైరెక్టర్ మేలెవీటిల్ దామోదరన్ స్థానంలో IAF 25వ ఎయిర్ చీఫ్ మార్షల్ BS ధనోవా (రిటైర్డ్) నియమితులయ్యారు. "బోర్డ్ ఆఫ్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్‌లో చేరడానికి ఆహ్వానించబడినందుకు సంతోషిస్తున్నట్లు" మెహతా తెలిపారు. "పనితీరు, భద్రత విశ్వాసంతో దేశంలోని పౌర విమానయాన రంగంలో ఇండిగో బోర్డ్ అగ్రగామిగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని" B. S. ధనోవా (రిటైర్డ్) అన్నారు.