మహిళా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు..
దిశ, సిద్దిపేట: తెలంగాణలోని మహిళా- Media Academy Chairman Allam Narayana said that special training classes for women journalists will be conducted in Hyderabad in April
దిశ, సిద్దిపేట: తెలంగాణలోని మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏప్రిల్ మాసంలో హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులలో పాల్గొనాలనుకునే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్ లో మహిళా జర్నలిస్టులు మీడియా అకాడమీ మేనేజర్ ఏ. వనజ (సెల్ నె.7702526489)ను జిల్లాల్లో పనిచేసే వారు ఆయా జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని అన్నారు. మొదటిరోజు రాష్ట్ర మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాసనసభ్యులు ఈ శిక్షణా తరగతుల్లో ప్రసంగిస్తారు. రెండో రోజు జాతీయ స్థాయిలో నిష్ణాతులైన మహిళా జర్నలిస్టులు ప్రసంగిస్తారు.
ఈ శిక్షణా తరగతుల్లో మొదటి రోజు 'మహిళా జర్నలిస్టులు - ప్రధాన స్రవంతి మీడియా - మహిళల పాత్ర' అనే అంశంపై 'పాత్రికేయ రంగంలో మహిళలు - ప్రత్యేక సమస్యలు' అనే అంశంపై ప్రసంగాలు ఉంటాయి. రెండవ రోజు 'మహిళా అస్తిత్వం - జెన్డర్ సెన్సీటైజేషన్' అనే అంశం, 'ఫీచర్ జర్నలిజం - మెళకువలు' అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్ణాతులైన వారి ప్రసంగాలు వుంటాయి.
ఈ తరగతులలో అకాడమీ ప్రచురణలు మహిళా జర్నలిస్టులకు ఇవ్వబడుతాయి. మార్చి 26, 27 తేదీల్లో మీడియా అకాడమీ నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు విజయవంతంగా జరిగాయని, దాదాపు 2000 దళిత జర్నలిస్టులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి శ్రద్ధగా తరగతులను విన్నారని ఈ సందర్భంగా చైర్మన్ గుర్తు చేశారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.