బ్రెజా' కోసం బుకింగ్ ప్రారంభించిన మారుతీ సుజుకి!

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజా మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.

Update: 2022-06-20 09:31 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజా మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. 2022 మోడల్ మారుతీ బ్రెజా కారును కొనాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్ లేదా కంపెనీ డీలర్‌షిప్‌ల వద్ద రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేయవచ్చని తెలిపింది. భారత మార్కెట్లో ఈ కారును ఈ నెలాఖరులో విడుదల చేయనున్నారు. ఇదివరకటి కంటే అత్యాధునిక ఫీచర్లతో పాటు మెరుగైన సౌకర్యాలతో ఇది లభిస్తుందని, కారు విడుదల తర్వాత పూర్తి వివరాలను తెలుస్తాయని కంపెనీ పేర్కొంది. కొత్త జనరేషన్ వినియోగదారులకు అనుగుణంగా కొత్త వెర్షన్‌లో మార్పు చేశామని, అయితే, ఇదివరకు ఈ మోడల్‌కు ఉన్న 'విటారా బ్రెజా' పేరులో కేవలం బ్రెజా అనే పేరును మాత్రమే కొనసాగిస్తున్నామని కంపెనీ వివరించింది.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, సరికొత్త బ్రెజా మోడల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు అత్యాధునిక డిజైన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎల్ఈడీ డీఎల్ఆర్ లైట్లను అమర్చినట్టు మారుతీ సుజుకి వెల్లడించింది. మొదటిసారిగా ఈ కారును 2016లో మార్కెట్లో విడుదా చేశామని, దేశీయంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చిందని కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. కేవలం ఆరేళ్ల కాలంలో 7.5 లక్షల యూనిట్లకు పైగా విక్రయించామని, ఇప్పటికీ మోడల్‌కు బలమైన మార్కెట్ వాటా ఉందని ఆయన వెల్లడించారు.


Similar News