విశాల్‌తో పెళ్లి.. అసలు నిజాలు బయటపెట్టిన అభినయ!
స్టార్ నటి అభినయ(Abhinaya) హీరోయన్లకు మించిన అందంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
దిశ, సినిమా: స్టార్ నటి అభినయ(Abhinaya) హీరోయన్లకు మించిన అందంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో చెల్లిగా నటించి మెప్పించింది. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చిత్రంలో వెంకటేష్(Venkatesh), మహేష్(Mahesh Babu) మూవీతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అయితే ఈ అమ్మడు గత కొద్ది కాలంగా విశాల్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై విశాల్(Vishal) చాలా సార్లు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ ఆగడం లేదు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ, విశాల్‌తో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మార్క్ ఆంటోనీ(Mark Antony) సినిమా చేసినప్పుడు విశాల్‌తో ప్రేమలో ఉన్నానని త్వరలో పెళ్లి కూడా జరగబోతుందని పలు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ వస్తుంది. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి విశాల్(Vishal) సినిమాలు చూసే అలవాటు ఉంది. అతనంటే నాకు చాలా ఇష్టం కానీ పెళ్లి చేసుకునేంత కాదు.
నేను విశాల్‌కు పెద్ద అభిమానిని ఎన్నోసార్లు ఆయన్ని ఒక్కసారి కలిస్తే బాగుండు అనిపించేది. కానీ ‘మార్క్ ఆంటోని’లో విశాల్‌తో నటించే చాన్స్ వచ్చింది. అప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. విశాల్ మాతోనే కలిసి తినేవారు. అతన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇక విశాల్‌తో పెళ్లి అంటూ వచ్చిన వార్తలు చూసి షాక్ అయ్యాను. ఇప్పటికైనా ప్రచారం చేయడం ఆపేయండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ అభినయ(Abhinaya) కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవన్నీ పుకార్లు అని మరోసారి తేలిపోయింది.