Manisha Koirala:‘ఆ పాత్రలో నటించొద్దని హెచ్చరించారు’.. ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ మనిషా కోయిరాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-11-09 02:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మనిషా కోయిరాలా(Manisha Koirala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అప్పట్లో స్టార్ దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ బొంబాయి(Bombāyi) లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ చిత్రంలో అరవింద స్వామి(Aravinda Swami) అండ్ మనీషా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనడంలో ఎటువంటి అతిశక్తిలేదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇందులో మనీషా ఓ వైపు తల్లి పాత్రలో.. మరోవైపు ప్రేయసిగా తన నటనతో అద్భుతమైన ఫర్ఫామెన్స్ ఇచ్చిన మనీషా కోయిరాలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు బయటపెట్టింది. బొంబాయి చిత్రంలో శైలా భాను(Shaila Bhanu) రోల్ లో నటించకూడదని అనుకున్నానని మనీషా వెల్లడించింది. ఎందకో ఈ బ్యూటీ కారణం కూడా చెప్పుకొచ్చింది. ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తే తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని చాలా మంది హెచ్చారించారని వివరించింది. ఈ సినిమా స్టోరీ తన వద్దకు వచ్చినప్పుడు.. తల్లిగా అమాయకంగా నటించాల్సి ఉంటుందని చెప్పారని, కాగా ఒక్కసారి మదర్ పాత్రలో నటించినట్లైతే ఇక అంతే సంగతి.. ఆ ఇమేజ్ లోనే ఇరుక్కుపోతావని అన్నారని తెలిపింది.

ఇక హీరోయిన్ గా అవకాశాలు అస్సలు రావని తన చుట్టూ ఉన్నవారు బొంబాయి సినిమాలో నటించవద్దని చెప్పారని తెలిపింది. కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా(Cinematographer Ashok Mehta).. దర్శకుడి గురించి చాలా గొప్పగా చెప్పారని.. ఆయన ప్రముఖ డైరెక్టర్, ఆయనతో కలిసి పనిచేసే చాన్స్ మిస్ చేసుకోవద్దని చెప్పారని పేర్కొంది. అప్పుడు కనుక ఈయన మాటలు వినకపోతే నా కెరీర్ ను చేంజ్ చేసే బెస్ట్ మూవీని మిస్ అయ్యేదాన్నని వెల్లడించింది మనీషా కోయిరాలా. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

Tags:    

Similar News