ManiRatnam : ఆమె అంటే చాలా ఇష్టం.. ప్రముఖ నటి గురించి మణిరత్నం సంచలన వ్యాఖ్యలు

తమిళ అగ్ర దర్శకుడు మణిరత్నం(ManiRatnam) ఓ నటి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-28 11:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళ అగ్ర దర్శకుడు మణిరత్నం(ManiRatnam) ఓ నటి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటి సాయి పల్లవి(Sai Pallavi)కి బిగ్ ఫ్యాన్ అంటూ ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న తాజా చిత్రం 'అమరన్'(Amaran). మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని, సహజమైన ఆమె హవాభావాలు తనకు ఎంతో నచ్చుతాయని, త్వరలోనే ఆమెతో కచ్చితంగా సినిమా చేస్తానని తన మనసులో మాట బయట పెట్టారు. స్టార్ డైరెక్టర్ మని రత్నం అంతటివాడు తమ అభిమాన నటిని మెచ్చుకోవడంతో సాయి పల్లవి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read More..

Sai Pallavi: అదొక పవిత్రమైన దేవాలయం అంటూ సాయిపల్లవి ఎమోషనల్ పోస్ట్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు 

Tags:    

Similar News