హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల నిర్వాకం.. 18 గంటలు లాకర్‌లో ఉన్న వృద్ధుడు

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్‌లో యూనియన్ బ్యాంకులో ఉద్యోగులు చేసిన నిర్వాకం latest telugu news..

Update: 2022-03-29 08:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్‌లో యూనియన్ బ్యాంకులో ఉద్యోగులు చేసిన నిర్వాకం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బ్యాంకుకు వెళ్లిన ఓ వృద్ధుడిని బ్యాంకు లాకర్ లో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం 4.20 గంటలకు 87 ఏళ్ల వృద్ధుడు కృష్ణారెడ్డి(87) జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంకుకు చేరుకొని లాకర్‌ గదిలోకి వెళ్లారు. అది గమనించని బ్యాంకు సిబ్బంది.. లాకర్ గదికి తాళం వేసి వెళ్లిపోయారు.

రాత్రైనా ఇంటికి రాకపోవడంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా వృద్ధుడు బ్యాంకులోనే ఉండిపోయినట్లు గుర్తించారు. 18 గంటల అనంతరం మంగళవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. ఆయనకు షుగర్ , బీపీ ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News