ఆరేళ్లుగా తలస్నానం చేయని వ్యక్తి.. నో హెయిర్ లాస్

దిశ, ఫీచర్స్ : సాధారణంగా రెండు మూడు రోజులకోసారి షాంపూతో తలస్నానం చేయకుంటేనే చిరాకుపడతాం.

Update: 2022-04-11 07:03 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా రెండు మూడు రోజులకోసారి షాంపూతో తలస్నానం చేయకుంటేనే చిరాకుపడతాం. నెత్తిన ఏదో భారం మోసినట్లుగా ఫీల్ అయిపోతుంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా ఆరేళ్ల నుంచి జుట్టుకు ఎటువంటి షాంపూ, కండిషనర్ వాడకుండా వార్తల్లో నిలిచాడు. పైగా ఇప్పుడు అతని జుట్టు చాలా ఆరోగ్యంగా ఉండటం విశేషం.

నిక్ కోయిట్జ్ అనే యువకుడు విద్యార్థిగా ఉన్నప్పుడే తీవ్ర హెయిర్ ఫాల్ ఇష్యూతో బాధపడేవాడు. స్కూల్‌లో ఫస్ట్ సెషన్ ముగిసేసరికి తన షర్ట్‌‌పై మొత్తం వెంట్రుకలే ఉండేవి. అందుకే అదనంగా మరొక షర్ట్ వెంట తీసుకెళ్లేవాడినని నిక్ తన టిక్‌టాక్ వీడియోలో వెల్లడించాడు. అయితే ప్రతిరోజు తాను వాడుతున్న షాంపూ, కండిషనర్ వల్లే ఈ సమస్య మరింత తీవ్రతరమైందని భావించిన నిక్.. అప్పటి నుంచి హెయిర్ వాష్ చేయడం మానేశాడు. ఆ తర్వాత కొంతకాలానికే అతని హెయిర్ చాలా ఆరోగ్యవంతంగా తయారైంది. కాగా ఈ పద్ధతినే '#nopoomovement'గా పిలుస్తారని నిక్ చెప్పుకొచ్చాడు.

నిజానికి జుట్టును వాష్ చేయడం మానేస్తే అది జిడ్డుగా తయారవుతుంది. కానీ సుమారు రెండు మూడు వారాల తర్వాత కుదుళ్ల నుంచి సహజ నూనెలు ఉత్పత్తి అవుతాయని, దీంతో జిడ్డు సమస్యలు తొలగిపోతాయని నిక్ తెలిపాడు. అప్పుడు ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ అవసరం లేకుండానే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందన్నాడు. ఇంకెందుకు ఆలస్యం.. దీర్ఘకాలికంగా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు ఒకసారి #nopoomovement ప్రయత్నించి చూడండి.

Tags:    

Similar News