ఐదేళ్లుగా ఆగని అపాన వాయువు.. రెస్టారెంట్‌పై రూ. కోటి దావా

దిశ, ఫీచర్స్ : ఐదేళ్ల క్రితం హామ్ రోల్(ఒక రకమైన శాండ్‌విచ్) తిన్న ఓ వ్యక్తి జీవితం తలకిందులైంది.

Update: 2022-07-24 15:13 GMT

దిశ, ఫీచర్స్ : ఐదేళ్ల క్రితం హామ్ రోల్(ఒక రకమైన శాండ్‌విచ్) తిన్న ఓ వ్యక్తి జీవితం తలకిందులైంది. అప్పటి నుంచి అపానవాయువు ఆపుకోలేక తంటాలు పడుతున్నాడు. ఈ పరిస్థితికి ఆ హామ్ రోల్ కారణమని ఆరోపించిన సదరు వ్యక్తి.. తనకు ఆ శాండ్‌విచ్ విక్రయించిన కంపెనీపై రూ. కోటి రూపాయల దావా వేశాడు.

46 ఏళ్ల టైరోన్ ప్రేడ్స్..బర్మింగ్‌హామ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో ఒక ఫుడ్ ఐటెం కొనుగోలు చేశాడు. డిసెంబరు 2017లో అతను ఆ హామ్ రోల్ తిన్న కొన్ని గంటల్లోనే కడుపులో తిమ్మిరి, జ్వరం, వాంతులు, విరేచనాలకు గురయ్యాడు. దీంతో ఐదు వారాల పాటు మంచానపడ్డాడని అతని లాయర్లు హైకోర్టుకు తెలిపారు. అంతేకాదు అప్పటి నుంచి నియంత్రణలేని విధంగా అపానవాయువు విడుదలవుతుండటంతో ఇబ్బంది పడుతున్నాడు. నెలరోజుల తర్వాత అనారోగ్యం తగ్గుముఖం పట్టినప్పటికీ తన కడుపులో ఇప్పటికీ విచిత్రమైన శబ్దాలు వస్తూనే ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. అపానవాయువు శబ్దాలతో తనకు రాత్రి పూట నిద్ర కూడా కరువైందని పేర్కొన్నారు.

ఫుడ్ స్టాల్‌పై కోటి రూపాయల దావా

ఫ్రాంక్‌ఫర్ట్ క్రిస్మస్ మార్కెట్ లిమిటెడ్‌లో తాను కొనుగోలు చేసిన ఆహారం ద్వారా సాల్మొనెల్లా బ్యాక్టీరియా బారినపడ్డానని, వారి నిర్లక్ష్యానికి పరిహారంగా £200,000కు పైగా నష్ట పరిహారం చెల్లించాలని దావా వేశాడు. అయితే ఈ ఆరోపణలను ఫుడ్ కంపెనీ తోసిపుచ్చింది. హెల్త్ ఆఫీసర్స్ తనిఖీల్లో సాల్మొనెల్లా కనుగొనబడలేదని వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News