రచయితగా మారిన హాట్ బ్యూటీ.. ఏం రాసిందో తెలుసా?
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా రచయిత అవతారమెత్తింది. ఈ మేరకు పోషకాల(న్యూట్రీషన్)పై తాను రాసిన తొలి పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది..Latest Telugu News
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా రచయిత అవతారమెత్తింది. ఈ మేరకు పోషకాల(న్యూట్రీషన్)పై తాను రాసిన తొలి పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ బుక్‌లో ఆరోగ్యానికి సంబంధించి పలు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చర్చించినట్లు వెల్లడించిన మలైకా.. 'పుస్తకం రాయడం వల్ల నా భావాలను మరింత మందితో పంచుకునే అవకాశం లభించింది.
శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగానూ బలంగా ఉంటామని నేను గట్టిగా నమ్ముతా. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యంగా లేకపోయినా మనం సరిగ్గా లేనట్లే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా' అని వివరించింది. అయితే ఈ పుస్తకాన్ని ఏ పబ్లికేషన్ ముద్రించింది? ఎప్పుడు, ఎక్కడ ఆవిష్కరణ చేయబోతుందనే విషయాలు తెలియాల్సి ఉంది