Rahman: విడాకుల ప్రకటన తర్వాత తొలిసారిగా కనిపించిన రెహమాన్.. సంచలన కామెంట్స్ వైరల్..!
గోవాలో జరిగిన 55 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: గోవా(Goa)లో జరిగిన 55 వ ‘అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(International Film Festival of India) కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహమాన్(AR Rahman) హాజరై.. విడాకుల తర్వాత మొదటిసారిగా కనిపించి పలు వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఫేస్ చేస్తోన్న డిప్రెషన్ గురించి ఆయన వేదికపై మాట్లాడారు. శారీరక అవసరాలపై ఇంట్రెస్ట్ పెట్టడం మానేయాలని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది డిప్రెషన్(Depression)కు లోనై.. చాలా సఫర్ అవుతున్నారని తెలిపారు.
దీనికి కారణం.. తమ లైఫ్ లో ఏదో ముఖ్యమైన వాటిని మిస్ అయ్యామనే ఆలోచనలో ఉంటున్నారని వెల్లడించారు. ఇక మా లైఫ్‌లో ఏం లేదు.. జీవితమంతా శూన్యంలా మారిందనే భ్రమలో ఉంటున్నారని తెలిపారు. కానీ ఆ సిచ్యూవేషన్‌ను ఎలా ఫేస్ చేయాలో మాత్రం ఎవరికీ తెలియట్లేదని అన్నారు. అలాగే డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మ్యూజిక్ వినండని(music), ఇష్టమైన బుక్స్(Books) చదవండి లేదా రాయండని సలహా ఇచ్చారు. దీంతో మానసిక ప్రశాంతత(Mental peace) దొరుకుందని పేర్కొన్నారు.
ఇఫీ వేడుక(Ifi ceremony)లో గతంలో తన తల్లి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. మనం ఇతరుల కోసం బతుకుతున్నప్పుడు సూసైడ్(Suicide) ఆలోచనలు రావని తన తల్లి చెప్పిందని అన్నారు. రెహమాన్ జీవితంలో ఇది గొప్ప సలహా అని తెలిపారు. తన తల్లి మాటలు.. రెహమాన్ జీవితాన్నే మార్చేశాయని, తన జీవితానికి లోతైన అర్థాన్ని ఇచ్చాయని వివరించారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఈ మాటలు సహాయపడ్డాయని రెహమాన్ పేర్కొన్నారు.