Mahua Moitra: మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎంపీ బిగ్ షాక్?
Mahua Moitra Unfollows TMC On Twitter After Party Condemns her Comments On Goddess Kaali| పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎంపీ షాక్ ఇవ్వనున్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా త్వరలో
దిశ, వెబ్‌డెస్క్: Mahua Moitra Unfollows TMC On Twitter After Party Condemns her Comments On Goddess Kaali| పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎంపీ షాక్ ఇవ్వనున్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీఎంసీ పార్టీలో ముఖ్యమైన నేతగా ఉన్న ఆమెది బీజేపీ విధానాలపై విరుచుకుపడే స్వభావం. అలాంటి మహువా మెయిత్రా ట్విట్టర్‌లో టీఎంసీ పార్టీని అన్ ఫాలో చేయడమే ఈ దుమారానికి కారణం అవుతోంది.
ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేదు: టీఎంసీ
లీనా మణిమేకలై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌పై దేశ విదేశాల్లో రచ్చ జరుగుతోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే మొయిత్రా చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. మంగళవారం ఓ సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. 'నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి' అని వ్యాఖ్యానించారు. దేవీ ఆరాధన విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. కాళీ మాతను మాంసాహారిగా పేర్కొనడంతో మమతా బెనర్జీ పార్టీ అలర్ట్ అయింది. పొలిటికల్‌గా డ్యామేజ్ జరగకముందే స్పందించింది. మొయిత్రా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆమె ఉన్నట్టుండి ట్విట్టర్‌లో పార్టీని అన్ ఫాలో చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. మెయిత్రా తన ట్విట్టర్ ఖాతాలో మమతా బెనర్జీ, టీఎంపీ పార్టీని మాత్రమే ఫాలో అవుతూ వస్తున్నారు. తాజాగా టీఎంసీ పార్టీని అన్ ఫాలో చేయడం వెనుక పొలిటికల్ స్టెప్ ఏదైనా ఉండి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన వ్యాఖ్యల విషయంలో పార్టీ మద్దతుగా నిలబడకపోవడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నారా? పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.