ఆ మంత్రి అసమర్థత వల్లే నిర్మల్‌కు మెడికల్ కాలేజీ రాలేదు: ఏలేటి

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంత్రి ఐకే రెడ్డి తన అసమర్థత వల్ల నిర్మల్‌కు మెడికల్- latest Telugu news

Update: 2022-03-07 15:00 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంత్రి ఐకే రెడ్డి తన అసమర్థత వల్ల నిర్మల్‌కు మెడికల్ కాలేజీ తెప్పించలేకపోయారని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పక్క జిల్లా ఆసిఫాబాద్‌కు మెడికల్ కాలేజీ మంజూరైందని.. నిర్మల్‌ను ఎందుకు విస్మరించారో జిల్లా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ రాకున్నా వచ్చిందని ప్రజలను నమ్మించి.. స్థల సేకరణ పేరుతో భూములకు విలువ పెంచి రియల్ దందా చేస్తున్నారని ఫైరయ్యారు. గతంలో చెప్పిన చుక్ చుక్ రైలు, ఈఎస్ఐ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హామీలని ఒట్టి మాటలయ్యాయని, కనీసం ఈ మెడికల్ కాలేజీ విషయంలోనైనా నిజం జరుగుతుందని అనుకుంటే.. నిరాశ తప్పలేదన్నారు. స్వయంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు జిల్లాలో పర్యటించిన వారం రోజుల్లోనే బడ్జెట్ వచ్చినా జిల్లాకు సర్కార్ ఇచ్చింది ఏమీలేదు.. మన మాటల మంత్రి తెప్పించింది ఏదీ లేదన్నారు. అభివృద్దిపై చిత్తశుద్ది కంటే కుటుంబ సభ్యులకు ఆస్తులు పెంచడం, కబ్జాలు, కమీషన్లు, ఆక్రమణలలు, అవినీతిలో మంత్రి మునిగిపోయారని ఆరోపించారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

Tags:    

Similar News