బాసర అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్

Update: 2024-12-20 08:29 GMT

దిశ,భైంసా : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికి, మనవడు శ్రీరామ దేవద్ర్ రెడ్డి కి ఆలయ స్థానాచార్యులు చే అక్షర శ్రీకారం నిర్వహించారు. అనంతరం అమ్మవారి గర్భాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.వీరి వెంట స్థానిక ఎమ్మార్వో ,పోలీస్ సిబ్బంది దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది ఉన్నారు.


Similar News