TG Assembly: ‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ప్రభుత్వం ఆదేశం.. సభలో మంత్రి పొంగులేటి ప్రకటన

‘ధరణి’ (Dharani)పై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌ (Forensic Audit)కు ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రకటించారు.

Update: 2024-12-20 08:52 GMT
TG Assembly: ‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ప్రభుత్వం ఆదేశం.. సభలో మంత్రి పొంగులేటి ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ‘ధరణి’ (Dharani)పై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌ (Forensic Audit)కు ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో భూ భారతి బిల్లు (Bhu Bharathi Bill)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధరణి’ (Dharani)పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1.50 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయని ఆరోపించారు. లిటిగేషన్‌లో ఉన్న భూములను పార్టీ-బీ‌ (Part-B)లో పెట్టి ఆ భూములను సక్రమం చేసుకున్నారని తెలిపారు. దోచిన భూములను బీఆర్ఎస్ (BRS) నేతలు తమ అస్మదీయులకు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు.

కొన్నిచోట్ల భూములకు యజమానులు ఇక్కడ లేరని.. పాకిస్తాన్ (Pakistan) వెళ్లిపోయారని, అధికారులు నో అబ్జెక్షన్ (No Objection) చెప్పారంటూ ఆ భూములను కూడా కాజేశారని పేర్కొన్నారు. ధరణి (Dharani) వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు, నలుగురు వ్యక్తులు మీద మాత్రమే బదలాయింపు అయిందన్నారు. బీఆర్ఎస్ (BRS) నేతలు చేసిన అక్రమాలను నిగ్గు తేలుస్తామని ధ్వజమెత్తారు. ధరణి (Dharani) పేరుతో నిరుపేదల ఆస్తులను కూడా కొల్లగొట్టారని ఆయన ఫైర్ అయ్యారు. అసెంబ్లీ (Assembly)లో ప్రతిపక్ష నేత కనిపించరని.. సభకు రారని సైటెర్లు వేశారు. రోజుకొక వేషంతో బీఆర్ఎస్ (BRS) సభ్యులు డ్రామాలు ఆడుతున్నారంటూ మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News