'ధరలు పెంచిన వాళ్లే ధర్నాలు చేయడం సిగ్గుచేటు'

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సామాన్యులపై అధిక - Maheshwar Reddy, chairman of the AICC Programs Implementation Committee, fired on the BJP and Teresa governments

Update: 2022-04-10 13:37 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సామాన్యులపై అధిక ధరల భారం మోపీ, అవే ప్రభుత్వాలూ రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్‌లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత డెబ్బై యేండ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని తెలిపారు. ధర్నాల పేరుతో గ్రామాల్లోకి వచ్చే బీజేపీ, తెరాస నాయకులను నిలదీయాలని ప్రజలను కోరారు. బీజేపీ, తెరాస ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు నిర్మల్ నియోజక వర్గంలో అన్యాక్రాంతం అవుతున్న అసైన్డ్ భూములపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నిర్మల్‌లో పేదలకు భూములు పంచాల్సిన పాలకులే.. పేదల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News