Stock Markets: ఏడు సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) మంగళవారం లాభాల్లో ముగిశాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత వారం రోజులు నుంచి నష్టాల్లో కొనసాగుతున్న మన బెంచ్ మార్క్ సూచీలు ఈ రోజు పుంజుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం, ఇన్వెస్టర్లు(Investers) కొనుగోళ్లు చేపట్టడంతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 77,548 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 78,451 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 239 పాయింట్ల లాభంతో 77,578.38 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 64.70 పాయింట్లు పెరిగి 23,518 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.90 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.42 దగ్గర ముగిసింది. కాగా మహారాష్ట్ర(Maharashtra)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ కు సెలవు ప్రకటించారు. మళ్లీ గురువారం మార్కెట్లు ఓపెన్ అవుతాయి.
లాభాలో ముగిసిన షేర్లు : టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా
నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ