ప్రేమకు హద్దులు లేవు..

దిశ, ఫీచర్స్ : ప్రేమ అనేది శక్తిమంతమైన భావోద్వేగం. రైట్ కెమిస్ట్రీ, గుడ్ టైమింగ్‌‌తో మ్యాజిక్‌ క్రియేట్ చేస్తుంది. ఇది ఒక పద్ధతిలో ఉండాలని సమాజం కోరుకున్నా..Latest Telugu News

Update: 2022-07-21 05:06 GMT

దిశ, ఫీచర్స్ : ప్రేమ అనేది శక్తిమంతమైన భావోద్వేగం. రైట్ కెమిస్ట్రీ, గుడ్ టైమింగ్‌‌తో మ్యాజిక్‌ క్రియేట్ చేస్తుంది. ఇది ఒక పద్ధతిలో ఉండాలని సమాజం కోరుకున్నా.. ఒక్కోసారి యాక్సెప్ట్ చేయలేని, అస్సలు ఊహించలేని విధంగా ఎదురై గెలిచి చూపిస్తుంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఎన్నిసార్లయినా ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు. అనుమతించినా.. ఆమోదయోగ్యం కాకపోయినా.. తన ఒడిలో ఓలలాడేందుకు సరిహద్దులు లేవని ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంది. ఈ మధ్య ఇంటర్నెట్‌లో హీట్ పుట్టించిన నరేష్-పవిత్ర, లలిత్ మోడీ-సుస్మితా సేన్, జెన్నీఫర్ లోపెజ్-బెన్ అఫ్లెక్ ప్రేమ కథలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుండగా.. 'లవ్ అండ్ బెట్టర్ హాఫ్‌, పేషెన్సీ, కైండ్‌నెస్‌' గురించి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

మోడీ-సేన్ లవ్ ట్రాక్ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. కేవలం డబ్బు కోసమే లలిత్ మోడీతో ప్రేమలో పడిందని సుస్మితపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. చాలా సింపుల్‌గా బేఫిట్టింగ్ రిప్లయ్ ఇచ్చిన భామకు సపోర్ట్‌గా నిలుస్తున్న సెలబ్రిటీలు తన క్యారెక్టర్‌ను ఆకాశానికెత్తేశారు. తొమ్మిది కాదు పది మందిని కోరుకున్నా తప్పు లేదంటున్న స్టార్స్.. ఆమెకు నచ్చిన విధంగా జీవించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఆమె ఒక ఐకాన్‌ అని పొగిడేస్తున్న వారు.. 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి న్యారో మైండ్ కలిగి ఉండటం ముమ్మాటికీ సొసైటీ తప్పేనని ఎత్తిచూపుతున్నారు.

ఇక ఓపిక, నమ్మకంతో 20ఏళ్ల తర్వాత కూడా లవ్ యాక్సెప్ట్ చేసి వైరల్ అయిన జంట జెన్నీఫర్ లోపెజ్-బెన్ అఫ్లెక్. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ జంట విషయంలో లోపెజ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. అఫ్లెక్ ఇంతకు ముందు జెన్నీఫర్ గార్నర్‌ను వివాహమాడాడు. అంతెందుకు లోపెజ్-అఫ్లెక్ 2002లో లవ్ ట్రాక్ నడిపినా.. అనివార్య కారణాల వల్ల 2003లో విడిపోయారు. కానీ అదే ప్రేమ 20 ఏళ్ల తర్వాత మళ్లీ వారిద్దరిని కలిపింది. అదే అఫెక్షన్‌తో కన్నీరు పెట్టుకునేలా చేసింది.

ప్రేమ జీవితంలో ఒక్కసారే పుడుతుందా?

మోడ్రన్ లవ్ స్టోరీస్ ప్రేమకు కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి. ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేసే ప్రేమ ఎంతో గొప్పదని చాటి చెప్తున్నాయి. ప్రేమ జీవితంలో ఒక్కసారి మాత్రమే పుట్టదని సాక్ష్యమిస్తున్నాయి. మలైకా అరోరా భర్తతో విడిపోయి అర్జున్ కపూర్‌ను ప్రేమించడం.. హృతిక్ భార్యతో విడిపోయి మరోసారి పెళ్లికి సిద్ధం కావడం.. ఇంతకు ముందు ఎంతో మందికి బ్రేకప్ చెప్పేసిన రణబీర్-అలియా భట్ ఒక్కటి కావడం.. ఇందుకు ఉదాహరణలు కాగా 'Love Is Love After All' అని చెప్పకనే చెప్తున్నారు.

మొత్తానికి సోషల్ మీడియా యూనివర్స్‌లో గోల్డ్ డిగ్గర్, ఏజ్ డిఫరెన్స్, ఏజ్ మ్యాటర్స్, మల్టిపుల్ మ్యారేజెస్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో.. సుస్మితా సేన్ 'హ్యాపీ ప్లేస్' అని డిక్లరేషన్ ఇవ్వడం.. ప్రేమ అనేది ఆనందించాల్సిన భావోద్వేగమని, దీన్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటిస్తోంది.

* లవ్ ఈజ్ రియల్

మీరు నిజంగా ప్రేమించే వారితో ఉన్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. నిజమైన ప్రేమను అనుభవించేందుకు ముసుగేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు లవ్ మరింత పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది.

* ప్రేమ.. మరో అవకాశం

ప్రతీ ప్రేమకథ స్ట్రెయిట్ ఫార్వార్డ్ అండ్ సింపుల్‌గా ఉండకపోవచ్చు. గులకరాళ్లతో కూడిన లేదా వంకరగా ఉండవచ్చు. కానీ హృదయం ఆ బంధాన్ని కోరుకుంటే అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. డిఫరెంట్ కల్చరల్ అండ్ ఫైనాన్షియల్ బ్యాగ్రౌండ్, పాస్ట్ ఫెయిల్యూర్స్ లేదా మీరే సెక్సువల్ ప్రిఫరెన్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే.. బ్రెయిన్ వద్దని చెప్పినా సరే హార్ట్ యాక్సెప్ట్ చేస్తే ముందుకు సాగడం కరెక్టే. జెన్నిఫర్ లోపెజ్- బెన్ అఫ్లెక్ నిరూపించినట్లుగా ప్రేమ అంటే రెండో అవకాశం ఇవ్వడం కూడా.

* ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడ ప్రేమ ఉంటుంది

ప్రేమ పుట్టినప్పుడు.. మనసులో చెలరేగిన తుఫాన్‌కు ప్రశాంతత దొరుకుతుంది. ప్రేమ తాకినప్పుడు, మనసులోని అలజడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుందో మీకు తెలుస్తుంది. ఒక సాధారణ కౌగిలింత, నుదిటిపై ముద్దు, నేను ఉన్నానని ఓదార్పునిచ్చే నమ్మకం.. ప్రేమ అనే భావోద్వేగాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయి.

* ప్రేమ.. బెస్ట్ కమ్యూనికేషన్:

అన్ని సంబంధాలకు కమ్యూనికేషన్ కీలకమే కానీ భాగస్వామి విషయానికొస్తే ఇది మరింత ముఖ్యం. ఒక వ్యక్తితో కలిసి ఉండాలనే కోరిక లేదా ఇకపై ఉండకూడదనుకునే భావన ఈ బంధంలో కీలకం. కాబట్టి ఆ భావాన్ని వ్యక్తపరచడం ప్రధానం.

* లవ్ ఫిల్డ్ విత్ లిటిల్ థింగ్స్:

ప్రేమ కోరుకునేవారు గోల్డ్ డిగ్గర్ లేదా డైమండ్ డిగ్గర్ అయ్యుంటారు అనేది 99శాతం తప్పు భావన. నిజానికి ఇద్దరు కలిసి సన్‌సెట్‌ను ఆస్వాదించడం, కలిసి వంట చేయడం, జంటగా సిరీస్ ఎంజాయ్ చేయడం, కప్పు కాఫీలో ప్రేమను అనుభూతి చెందడం.. ఇలాంటి లిటిల్ థింగ్స్ మాత్రమే కోరుకుంటారు. ఎంత మందితో డేటింగ్ చేసినా సరే అనుభవించాలనుకునేది, ఆస్వాదించాలనుకునేది ఇలాంటి చిన్న చిన్న విషయాలే. 


Similar News