Liver: ఐదు వ్యాయామాలతో ఈ అవయవం సేఫ్.. రోజుకి 30 నిమిషాలు చేస్తే చాలు..!

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే బాడీ స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Update: 2024-10-22 13:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ వ్యాయామం(exercise) చేస్తే బాడీ స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. శరీరపు బరువును నియంత్రించడంలో మేలు చేస్తుంది. కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఎముకలను బలంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని(Resistive power) వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా దైనందిక వ్యాయామం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, నిద్రలేమి, స్థూలకాయం, గుండె జబ్బులు, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు(Chronic diseases) రాకుండా నివారించవచ్చు. అయితే వ్యాయామం, కాలేయ ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది.

ఫ్యాటీ లివర్(Fatty liver) వ్యాధికి వ్యాయమమే బెస్ట్ మెడిసిన్ అని తరచూ వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. కాగా కాలేయ పనితీరు మెరుగుపర్చుకోవాలంటే వ్యాయామం తప్పకుండా చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. కాగా వ్యాయామాన్ని కనుక అలవాటు చేసుకుంటే మీ లైఫ్ స్టైలే ఛేంజ్ అవుతుంది. సైకిల్ తొక్కడం, డ్యాన్స్ వంటివి కాలేయాన్ని శుభ్రపరచడంలో మేలు చేస్తాయి. అంతేకాకుండా కొవ్వును కూడా కరిగిస్తాయి. వ్యాయామం గంటల తరబడి చేయనక్కర్లేదు. రోజూ కేవలం 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కాలేయ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. లివర్ మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో జీవక్రియను వేగవంతం చేయడంలో ఎంతో సహాయపడుతుంది.

కాగా లివర్ ను కాపాడుకోవాలంటే ఈ ఐదు వ్యాయామాలు తప్పనిసరిగా మీ జీవితంలో భాగం చేసుకోండి. బ్రిస్క్ వాకింగ్ (Brisk walking )చేయండి. ఈ వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కాలేయంలోని కొవ్వు కరిగిపోతుంది. రెండవది హైకింగ్(hiking). కొండలు ఎక్కడం, ఎత్తైన ప్రదేశాలను ఎక్కండి. దీంతో మీ కాలేయాన్ని టాక్సిన్స్ లేకుండా ఉంచుతుంది. పుష్ అప్ స్క్వాట్ వ్యాయామాలు(Push up squat exercises) చేయండి. ఈ వ్యాయామం జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.పైలేట్స్ వ్యాయామం(Pilates exercise). ఇది శారీరక శక్తిని పెంచడమే కాకుండా శరీరంలో బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో పైలేట్స్ బాగా పనిచేస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News