LIC SARAL Plan : అద్భుతమైన పథకం.. ఈజీగా రూ. 55 వేల పెన్షన్ పొందండి ఇలా..

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బులు ఊరికే ఖర్చు అవుతున్నాయి అని బాధపడుతున్నారా..?

Update: 2022-04-21 05:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బులు ఊరికే ఖర్చు అవుతున్నాయి అని బాధపడుతున్నారా..? డబ్బును పొదుపు చేసి ప్రతి నెల కొద్ది మొత్తంలో ఖర్చు చేయాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ పథకం. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. వీటి వలన అనేక మంది ప్రయోజనం పొందుతున్నారు. కాగా, ప్రతి నెల ఈజీగా డబ్బులు పొందడానికి ఎల్‌ఐ‌సీ సరల్ పెన్షన్ యోజన పాలసీ తీసుకొచ్చింది. ఇక ఈ పాలసీ తీసుకున్న వారు ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీకి గల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పాలసీ దారునికి కనీస 40 ఏళ్లు ఉండాలి.

ఆధార్ కార్డు తప్పనిసరి.

బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.

80 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా పాలసీ వర్తిస్తుంది.

సరల్ పెన్షన్ యోజన అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్.

పాలసీ తీసుకున్నప్పటి నుంచి పెన్షన్ వస్తుంది.

పాలసీలో ముఖ్యమైన సమాచారం :

సరల్ పెన్షన్ యోజన పాలసీలో ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన డబ్బును బట్టి నెలకు 1000 నుంచి 12 వేలు కనీసం తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక పాలసీదారు జీవించి ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది. మరణించిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన డబ్బులను నామినీకి ఇచ్చేస్తారు, లేదంటే వీరి మరణం తర్వాత భాగస్వామికి పెన్షన్ చెల్లిస్తారు. భాగస్వామి కూడా మరణిస్తే ఇక ఎవరికీ పెన్షన్ రాదు. ఇక ఈ పాలసీని ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా లేదంటే ఆన్ లైన్ లో అయినా సరే తీసుకోచ్చు. ఉదాహరణకి 60 ఏళ్లు ఉంటే మీరు రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. మీకు ఏడాదికి రూ.56,450 పెన్షన్ వస్తుంది. సింగిల్ లైఫ్ ఆప్షన్‌కు ఇది వర్తిస్తుంది. అదే జాయింట్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.55,950 పెన్షన్ వస్తుంది.

Tags:    

Similar News