Telangana News: రాజ్ భవన్‌ను తాకిన ఐదు 'పంచాయితీ'లు

దిశ, భద్రాచలం టౌన్: కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఐదు - Leaders of all-party communities under the auspices of the CPM petition to Governor Tamilsai

Update: 2022-04-11 13:25 GMT

దిశ, భద్రాచలం టౌన్: కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఐదు పంచాయతీలను తెలంగాణాలో కలిపేందుకు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై కు అఖిలపక్షం, ప్రజా సంఘాలు, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు కలిసి వినతి పత్రం అందించారు. సీపీఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ను రెడ్ క్రాస్ ప్రాంగణంలో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనలో 5th షెడ్యూల్డ్ ప్రాంతం ఏజెన్సీలోని ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా పోలవరం ముంపు పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపడం వల్ల భద్రాచలం పట్టణం తీవ్రంగా నష్టపోయిందని, భద్రాచలం కు ఆనుకుని ఉన్న భూభాగమంతా ఆంధ్రాలో కలవడం వల్ల భద్రాచలం పట్టణం దీపంలా మారిందన్నారు.

తెలంగాణలోని భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్ల మేర ఆంధ్ర ప్రాంతం దాటి వెళ్లాల్సి వస్తోందని, భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉంటే రాముని భూములు ఆంధ్రాలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ అయోధ్య గా పిలువబడుతున్న భద్రాచలం అభివృద్ధి చెందాలంటే వెంటనే భద్రాచలం కు ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపాలని, పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్ పొడిగించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రామాయణం సర్క్యూట్లో భద్రాచలంను చేర్చాలని, పోలవరం ముంపు నుండి భద్రాచలాన్ని కాపాడటానికి రక్షణ చర్యలు చేపట్టాలని, గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో వంతెన వేగవంతంగా పూర్తి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్ బాబు, టీడీపీ మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కొడాలి శ్రీనివాస్ రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అరికెల తిరుపతిరావు, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్, లైన్ సూర్యనారాయణ, పల్లంటి దేశ దేసప్ప, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీలకు గవర్నర్ చేతుల మీదుగా సీమంతం..


సోమవారం కూనవరం రోడ్ లోని వీరభద్ర ఫంక్షన్ హాల్ లో వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు సీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొమ్ము కోయ నృత్యం కళాకారులు స్వాగతం పలికారు. నృత్యకారులతో గవర్నర్ నృత్యం చేశారు. అనంతరం సీమంతం వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీమంతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని చెప్పారు. సీమంతం మాతృత్వపు బాధ్యతలతో రోగ నిరోధక శక్తులను తెలియజేస్తుందని చెప్పారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకోవాలని చెప్పారు. ప్రసవం తదుపరి తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉండేందుకు టీకాలు వేసుకోవాలని చెప్పారు.

Tags:    

Similar News