పునీత్ పుట్టినరోజు కానుకగా రానున్న 'జేమ్స్'.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

దిశ, సినిమా: కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన ..telugu latest news

Update: 2022-03-10 12:42 GMT

దిశ, సినిమా: కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్'. ఆర్మీ ఆఫీసర్‌గా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ నటించగా హీరో శ్రీకాంత్ విలన్‌ పాత్ర పోషించాడు. కాగా చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పునీత్ జయంతి సందర్భంగా 2022 మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక మూవీనుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమాను.. కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా చరణ్ రాజ్ సంగీతం అందించారు.

Tags:    

Similar News