లడఖ్‌లో హెలికాప్టర్ సేవలు!
దిశ, ఫీచర్స్ : అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు సహా హిమవన్నగవులు నెలవైన ప్రదేశం లడఖ్..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు సహా హిమవన్నగవులు నెలవైన ప్రదేశం లడఖ్. సాహస యాత్రలను ఇష్టపడేవారికే కాక నేచర్ లవర్స్‌కు కూడా ఇది ఫేవరెట్ ప్లేస్. జమ్ము కశ్మీర్‌లో సముద్ర మట్టానికి సుమారు 3000 మీటర్ల ఎత్తులోఉన్న ఈ ప్రాంతానికి ఏటా వేలాది మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. వారి కోసమే లడఖ్ అడ్మినిస్ట్రేషన్ హెలికాప్టర్ సేవలు ప్రారంభించింది. ఈ సౌకర్యంతో లడఖ్‌లోని ప్రధాన గమ్యస్థానాలకు సులభంగా వెళ్లవచ్చు.
లడఖ్‌లో హెలీకాప్టర్ సేవలు దాదాపు రెండేళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. చలికాలంలో ఇక్కడి రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండటంతో ప్రధానంగా రోగుల తరలింపు, నివాసితుల రవాణా నిమిత్తం ఈ సేవలను ఉపయోగించగా.. ఈ నెల నుంచి పర్యాటకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. జూన్ 28న లేహ్‌లో ఒక బ్యాచ్ పర్యాటకులు ఇప్పటికే ఈ సేవను వినియోగించుకున్నారు.
కార్గిల్‌లోని పురాతన మఠాలను సందర్శించాలనాన్నా లేదా జంస్కార్ వ్యాలీలో ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్నా.. ఐదు సీట్లతో కూడిన B-3 చాపర్, అతిపెద్ద Mi-172 చాపర్ అక్కడికి తీసుకెళ్తాయి. లడఖ్‌లో 'లేహ్, ద్రాస్, కార్గిల్, లింగ్‌షెడ్, నైరక్, పదమ్, జంస్కార్' వంటి ప్రధాన గమ్యస్థానాలకు చుట్టేయొచ్చు. అంతేకాదు ఈ కొత్త చాపర్ సర్వీస్‌తో లేహ్ నుంచి కార్గిల్‌కు ఒక గంట వ్యవధిలో, అలాగే లేహ్ నుంచి జంస్కార్‌లోని పదమ్‌కు సుమారు 45 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అయితే సాధారణంగా రోడ్డు మార్గంలో లేహ్ నుంచి జంస్కార్ వరకు ప్రయాణించాలంటే హాఫ్ డేకి పైగా సమయం పడుతుంది.
ఒక్క సీటు కోసం చార్జీలు రూ.7,000 నుంచి ప్రారంభమవుతాయి. ప్రయాణించే ప్రదేశం ఆధారంగా ధరలు మారుతూ ఉంటాయి. టిక్కెట్ల లభ్యత.. వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ పరిమితులు, ఆ సమయంలో డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సేవను ఉపయోగించుకోవాలనుకుంటే రెండు రోజుల ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్.