దిశ, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ భూముల విషయంలో జరుగుతున్న ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని యూనివర్సిటీ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ అతిథి గృహంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు మాచర్ల రాంబాబు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఎస్ఎఫ్‌డి స్టేట్ కో కన్వీనర్ పైండ్ల అమర్ మాట్లాడుతూ..స్థానిక ప్రజాప్రతినిధులు అండ దండలతో ఎదేచ్చగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూ ఆక్రమణలపై ఏబీవీపీ 15 సంవత్సరాల నుంచి పోరాడుతుందని చెప్పారు. అయిన యూనివర్సిటీ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. యూనివర్సీటి భూములు ఆక్రమణకు గురవుతున్నాయని పలు మార్లు యూనివర్సీటి అధికారులకు విన్నవించినప్పటికి పట్టించుకోకుండ, ప్రభుత్వ అండదండలతో బీసీలుగా, రిజిస్టర్‌లుగా, పాలక మండలి సభ్యులుగా చెలామణి అవుతున్నారని విమర్షించారు.
కన్న తల్లి లాంటి యూనివర్సీటి అదికారులే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. యూనివర్సీటి భూముల పై డిజిటల్ సర్వే చేయించాలని కొంత మంది అధికారులు పూనుకున్నప్పటికి.. పాలకమండలిలోని కొంత మంది సభ్యులు, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల యూనివర్సిటీ యాజమాన్యం భూముల సర్వే వద్దు అంటూ గోప్యంగా రాసిన లేఖలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో యూనివర్సిటీ పాలకులకు దగ్గరగా వ్యవహరిస్తూ.. యూనివర్సిటీ భూమిని కబ్జా చేసిన ఓ యూనివర్సిటీ అధికారి భూముల సర్వే అపించడంలో కీలక సూత్రధారి గా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ తతంగాన్ని పక్కదారి పట్టించడం కోసం అసలు ని వదిలి కొసరు ను పట్టుకొన్నట్లు, SDLCE లో ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించారన్నారు. ఈ వ్యవహారం అంతా కూడా వీసి, రిజిస్ట్రార్ కనుసన్నల్లో జరుగుతుందని, దీనిపై పూర్తి ఆధారాలతో కలెక్టర్‌ని, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిని, గవర్నర్‌ని కలసి సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కోరడం జరుగుతుందని కేయూ ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జల్లెల శివ, బండారి ప్రవీణ్, మదాసి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.