ప్రఖ్యాత పరిశోధన సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి..
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీలో- latest Telugu news
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీలోభాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పిడి, జాయింట్ రీసెర్చ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో స్క్రిప్స్ తన భాగస్వామ్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇవాళ శాండియాగోలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, స్క్రిప్స్ పరిపాలక సభ్యులైన డా. జేమ్స్ విలియమ్సన్ (ఈవీపీ రీసెర్చ్ అండ్ అకడమిక్ అఫైర్స్ ), మేరీవాంగ్ (స్ట్రాటజిక్ ప్లానింగ్ డైరెక్టర్), డాక్టర్. అర్నాబ్ ఛటర్జీ (వీపీ, మెడిసినల్ కెమిస్ట్రీ, కాలిబర్-స్క్రిప్స్ రీసెర్చ్), ప్రొఫెసర్ సుమిత్ చందాలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీ వివరాలను వారికి కేటీఆర్ వివరించారు.