Kriti Sanon: కృతి సనన్ బోల్డ్ వీడియో వైరల్.. షాక్‌లో నెటిజన్లు
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘హీరోపంతి’(Heropanti) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన కృతి తన నటనతో ఫుల్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక తెలుగులో ‘నేనొక్కడినే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మైమరిపించింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘ఆదిపురుష్’లో సీతగా నటించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇటీవల ‘దో పత్తీ’(Do Patti)మూవీతో హిట్ అందుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు మూవీస్ చేస్తూనే.. మరోవైపు యాడ్స్‌లోనూ నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కృతి ససన్‌కు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె ఏదో కూల్ డ్రింక్ తాగుతుండగా.. ఓ వ్యక్తి ఆమె కాలుని పట్టుకుంటాడు. దీంతో ఆమె వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.