ఆడపిల్ల ఇలాగే ఉండాలని నాన్న ఎప్పుడూ చెప్పలేదు.. యంగ్ బ్యూటీ

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి తన తండ్రితో రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..Latest Telugu News

Update: 2022-06-19 07:35 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి తన తండ్రితో రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'ఫాదర్స్‌ డే' సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. డాడీ వెరీ నైస్ పర్సన్ అని, తామిద్దరం ఫ్రెండ్స్‌లాగే ఉంటామని చెప్పింది. అలాగే ఆయనకు స్వీట్స్‌ అంటే చాలా ఇష్టం కావడంతో ప్రతి 'ఫాదర్స్ డే' కు స్పెషల్ కేక్‌ ఆర్డర్‌ చేసి సంతోషపెడతానని తెలిపింది.

ఇక తన విషయంలో డాడీ చాలా కేర్ తీసుకుంటాడన్న కృతి.. తనను వదిలి ఉండేందుకు అస్సలు ఇష్టపడరని చెప్పింది. 'అమ్మాయివి కదా! అలా ఉండకూడదు. ఇలా ఉండాలి' అని ఎప్పుడూ చెప్పలేదని, ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండాలంటూ ధైర్యం నింపుతారని గుర్తుచేసుకుంది. చివరగా 'లైఫ్‌లో బాధపడే క్షణాలు లేకపోతే ఆనందం విలువ తెలియదు. అందుకని కొన్ని బాధలు కూడా ఉండాలి. ఆ బాధను పాజిటివ్‌గా తీసుకుని అధిగమించాలి' అని చెబుతాడన్న ఆమె తనను ముద్దుగా 'బుంగీ' అని పిలుస్తాడంటూ ముగించింది.


Similar News