Krithi Shetty: ఆయనతో చేయాలంటే నా స్టామినా సరిపోదు.. బేబమ్మ

Krithi Shetty Interview about The Warrior Movie| రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా వస్తున్న చిత్రం 'ది వారియర్'. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. అయితే ఈ సినిమా జూలై 14న విడుదల

Update: 2022-07-05 11:10 GMT

దిశ, సినిమా : Krithi Shetty Interview about The Warrior Movie| రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా వస్తున్న చిత్రం 'ది వారియర్'. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. అయితే ఈ సినిమా జూలై 14న విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృతి శెట్టి.. 'విజిల్ మహాలక్ష్మీ' రోల్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పింది. 'లింగుస్వామితో పనిచేసే ఛాన్స్ రావడంతో ఎగ్జైట్ అయ్యా.

ఆయన కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు నన్ను పక్కింటి అమ్మాయిగానే ఫీల్ అవుతారు. ఇక రామ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే మనకు చాలా స్టామినా కావాలి. బయటకు ఆవేశంగా కనిపించినా.. హీ ఈజ్ వెరీ కూల్. అలాగే ఆది పినిశెట్టి విలన్ రోల్‌లో అద్భుతంగా నటించారు' అని వివరించింది. ఇక ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ్ నేర్చుకుంటున్నట్లు చెప్పిన బ్యూటీ.. తనను ఇంతలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. చివరగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ చూసి తను విజిల్స్ వేయడం మాత్రం పక్కా అంటూ ముగించింది బేబమ్మ.

Tags:    

Similar News