ఆ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగులో లేడీ డైరెక్టర్స్ తక్కువ : Kona Venkat
ప్రముఖ టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ ( Kona Venkat ) ఇప్పటికి ఎన్నో సినిమాలకి రచయితగా పని చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ ( Kona Venkat ) ఇప్పటికి ఎన్నో సినిమాలకి రచయితగా పని చేశారు. ఆయన రైటర్ గా వర్క్ చేసిన సినిమాలలో చాలా వరకు మంచి విజయం సాధించాయి. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో లేడీ డైరెక్టర్స్ ఎందుకు తక్కువన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఇక ఆయన మాట్లాడుతూ ' కొన్ని చోట్ల మగవారితో లేడీ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. కానీ, టాలీవుడ్ లో అలా లేదు. ఈ మధ్య కాలంలోనే ఇంట్లో నుండి బయటికొచ్చి తెలియని విషయాలను తెలుసుకుంటున్నారు. అందరితో సమానంగా పోటీ పడుతున్నారు. ఇప్పుడిప్పుడే తల్లి దండ్రుల సపోర్ట్ చేస్తున్నారు. హీరోలు కూడా వాళ్లకి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సౌత్ ఇండియన్స్ లో .. కొంతమంది ట్యాలెంట్ ను గుర్తించరు. అమ్మాయి, అబ్బాయి అన్న తేడాలు చూపించి వారిని తక్కువగా చూస్తారు. ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి కానీ, సినీ ఇండస్ట్రీ నుండి కానీ సరైన సపోర్ట్ ఉండదు. అందుకే, ఇక్కడ అమ్మాయిలు ఇండస్ట్రీకి రాలేకపోతున్నారంటూ ' కోన వెంకట్ అన్నారు.
Read More ..