టీఆర్ఎస్ ఎంపీలకు కోమటిరెడ్డి సవాల్.. రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ఎంపీలు రాజీనామా చేస్తే తాము సిద్ధమని- latest Telugu news
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ఎంపీలు రాజీనామా చేస్తే తాము సిద్ధమని కాంగ్రెస్ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రైతులపై సీఎం కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే రూ.20 వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రం ఆదాయం పెరిగిందని చెప్పే సీఎం ధాన్యం కొనుగోళ్లకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్రాజకీయాలకు స్వస్తి పలుకాలన్నారు. నేలతల్లిని నమ్ముకున్న రైతులను వేధించడం సరికాదని, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైతులు గందరగోళంలో ఉన్నారన్నారు. మరోవైపు రాష్ట్రంలో రోజుకు 10గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. పంట కోతకు వస్తున్న నేపథ్యంలో కరెంట్‌కోతలు విధిస్తున్నారని, పట్టణ ప్రాంతాలకు 24 గంటలు సరఫరా చేసి, వ్యవసాయానికి కోత పెడుతున్నారన్నారు.
రాహుల్‌ను కలిసిన ఎంపీలు..
కాంగ్రెస్అగ్రనేత రాహుల్‌గాంధీని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. పార్లమెంట్సమావేశాలకు హాజరై బయటకు వస్తున్న సమయంలో రాహుల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీలతో రాహుల్‌గాంధీ కొంతసేపు మాట్లాడారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలకు రాహుల్, సోనియా అపాయింట్మెంట్ దొరకడం లేదని వస్తున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా రాహుల్‌కు వివరించారు. దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ.. పార్టీ నేతలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర పరిస్థితులపై తాను పరిశీలన చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.