Pushpa-2: ‘పుష్ప-2’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. మరో సెన్సేషన్ కానున్న ‘కిస్సిక్’ (పోస్ట్)

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) కాంబోలో వస్తున్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం (Indian Biggest Film) ‘పుష్ప-2’ (Pushpa-2).

Update: 2024-11-21 15:29 GMT

దిశ, సినిమా: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) కాంబోలో వస్తున్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం (Indian Biggest Film) ‘పుష్ప-2’ (Pushpa-2). మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇండియాస్‌ ఫేమస్‌ ప్రొడ్యూసర్స్‌ నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిని లవర్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్స్ ఇప్పటికే ఐకాన్‌స్టార్‌ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవల బీహార్ (Bihar)లోని పాట్నా (Patna)లో జరిగిన బిగ్గెస్ట్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ (Biggest Trailer Event) ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ట్రైలర్‌‌తో సినిమాపై క్రేజ్‌ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. ‘పుష్ప-2’ శ్రీలీల (Sree leela) ‘కిస్సిక్’ అనే స్పెషల్ సాంగ్ మెరవనున్న విషయం తెలిసిందే.

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రత్యేక పాట అప్‌డేట్‌ వచ్చేసింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలపై చిత్రీకరించిన ఈ ‘కిస్సిక్’ (Kissik) సాంగ్ ఈ నెల 24న చెన్నైలో జరగనున్న గ్రాండ్‌ ఈవెంట్‌లో ఏడు గంటల రెండు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఒకవైపు ఐకాన్‌ స్టార్‌, మరో వైపు డ్యాన్స్ క్వీన్ శ్రీలీల.. ఈ కాంబోలో వస్తున్న స్పెషల్ సాంగ్ కోసం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా.. వీరి పర్ఫామెన్స్‌తో ఈ సాంగ్‌ పుష్ప-2లో మరో సెన్సేషన్‌ కానుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ‘పుష్ప-2’ మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.


Click Here For Twitter Post.. 

Tags:    

Similar News