Kerala Savaari: 'క్యాబ్' సర్వీస్ ప్రారంభించనున్న కేరళ ప్రభుత్వం!

Kerala Government to Launch Online Cab Service 'Kerala Savaari' In August| ప్రయాణికులకు సురక్షితమైన, ఇబ్బంది లేని సేవలు అందించేందుకు కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ క్యాబ్ సర్వీస్‌ను తీసుకొస్తుంది. 'కేరళ సవారీ' పేరుతో ఆగస్టు 17 నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది

Update: 2022-08-02 07:57 GMT

దిశ, ఫీచర్స్: Kerala Government to Launch Online Cab Service 'Kerala Savaari' In August| ప్రయాణికులకు సురక్షితమైన, ఇబ్బంది లేని సేవలు అందించేందుకు కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ క్యాబ్ సర్వీస్‌ను తీసుకొస్తుంది. 'కేరళ సవారీ' పేరుతో ఆగస్టు 17 నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కరోనా మహమ్మారి తర్వాత కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్న ఆటో, ట్యాక్సీ కార్మికులను ఆదుకోవడం, ప్రజలకు అతితక్కువ ధరలకే క్యాబ్ సర్వీస్‌ను అందించడం ఈ పథకం ఉద్దేశ్యం కాగా.. దేశంలోనే తొలిసారి ఈ తరహా ప్రయోగం చేస్తున్న రాష్ట్రంగా కేరళ నిలిచింది.

తిరువనంతపురంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేసిన కేరళ ప్రభుత్వ కార్మిక శాఖ.. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆటో-టాక్సీ సర్వీస్‌ను లింక్ చేస్తున్న పథకంలో సుమారు 500 ఆటోరిక్షాలు భాగం కానున్నాయి. కేరళ సవారీ కూడా ఉబెర్, ఓలా వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ల తరహాలోనే ఉంటుంది కానీ సర్వీస్ చార్జ్ కేవలం 8శాతంగా ఉంటుంది. అంతేకాదు అధిక డిమాండ్ ఉన్న సమయంలో రేట్లను పెంచే ఇతర టాక్సీ అగ్రిగేటర్ల మాదిరిగా కాకుండా 'కేరళ సవారీ' చార్జీలు ఒకే విధంగా ఉంటాయి. అయితే కచ్చితమైన కారణాలు లేకుండా రైడ్ క్యాన్సల్ చేస్తే మాత్రం కస్టమర్స్‌కు చిన్నపాటి జరిమానా విధిస్తారు. ఇక ఏదైనా ఆపద సమయంలో డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరూ కూడా యాప్ ద్వారా పానిక్ బటన్‌ని యాక్సెస్ చేయవచ్చు. ప్రతీ వాహనం నావిగేషనల్ (GPS) సిస్టమ్‌తో అమర్చబడుతుంది. పోలీసు క్లియరెన్స్ ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవడం సహా చివరికి బీమా కవరేజీ కూడా ఉంటుంది.

ఇక ఈ సేవ ద్వారా పర్యాటకాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేరళ ప్రభుత్వం. డ్రైవర్లు గైడ్స్‌గా పనిచేసేందుకు, సందర్శకులకు ప్రాథమిక సమాచారాన్ని అందించడానికి శిక్షణ పొందుతారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో 'కేరళ సవారీ' క్యాబ్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.

ఇది కూడా చదవండి: అమెరికా వీధుల్లో 'ఫ్లైయింగ్ కార్'!

Tags:    

Similar News