Brahmamudi: కోడలి కోసం కొడుకుతో యుద్ధం చేస్తున్న అపర్ణా దేవి
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ( Brahmamudi ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
కావ్య గుమ్మం బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక, అదే సమయానికి అత్త అపర్ణా దేవి కావ్య దగ్గరకి వస్తుంది. కళావతి అదే ఆలోచిస్తూ ఉంటుంది అసలేం జరుగుతుంది ? అత్తయ్య నాకోసం ఇక్కడికి రావడం ఏంటని తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అపర్ణా దేవికి ఇందిరా దేవి ఫోన్ చేస్తుంది.. ‘మీ అమ్మమ్మ కాల్ చేస్తున్నారు కావ్యా’ అంటూ ఫోన్ పైకి వినిపించేలా పెడుతుంది. ‘అత్తయ్యా ఎలా ఉన్నారు .. చెప్పండి’ అనగానే.. ‘ఏం చెప్పను అమ్మా.. అక్కడ, నువ్వు నీ కోడలు బాగానే ఉన్నారు. కానీ, ఇక్కడ నా పరిస్థితే బాలేదు.. నన్ను బాగా మీరిద్దరూ నా పక్కన లేకపోవడం నాకేం నచ్చలేదు’ అని ఇందిరా దేవి అంటుంది.
‘మీరేం బాధపడకండి అత్తయ్యా.. నా కొడుకు మనసు మారాలి.. దాని కోసం ఇంతకన్నా మంచి ప్లాన్ కనిపించలేదు. ఏదొకటి చేసి వాడిని చాలా మార్చేయాలి'అంటూ ఫోన్ లో సద్దిచెప్పి పెట్టేస్తుంది అపర్ణా దేవి. ఇక, వెంటనే కావ్యతో.. ‘ కావాలని మొత్తం నువ్వే చేసుకుంటున్నావ్ .. ఆ సమస్య మొత్తం నీదే.. నువ్వు మంచిగా ఉంటే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు.. అక్కడ మీ అమ్మమ్మకు కూడా ఇంత బాధ ఉండేది కాదు. వాడు దొంగతనం చేశాడని నీకు తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నావు .. నువ్వు సింపుల్ గా గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోలేదు' అంటూ తిడుతుంది. ‘ఏంటి అత్తయ్యా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నన్ను గ్యాప్ లేకుండా తిడుతూనే ఉన్నారు’ అంటుంది కావ్య. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.